Header Banner

టీటీడీ కీలక నిర్ణయం.. సీనియర్లకు ప్రత్యేక డిజిగ్నేషన్! జూన్ కోటా విడుదల!

  Tue Apr 29, 2025 10:21        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఆదివారం నాడు 78,177 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,694 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచివుండలేదు. క్యూ లైన్‌ల ద్వారా నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది.

 

ఇది కూడా చదవండిస్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

కాగా- భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఈశా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఈ నెల 30వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. మార్పులు చేర్పులు చేసిన అప్లికేషన్ ద్వారా శ్రీవారి సేవకులను ఎంపిక చేయనున్నారు టీటీడీ అధికారులు. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవకుల కోటాను కొత్త అప్లికేషన్ ద్వారా విడుదల చేస్తారు. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) కోటా ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌ బుకింగ్ ఓపెన్ అవుతుంది. నవనీత సేవ (మహిళలకు మాత్రమే)- మధ్యాహ్నం 12, పరకామణి సేవ (పురుషులకు మాత్రమే)- ఒంటిగంట, గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభం) 2 గంటలకు అందుబాటులోకి వస్తాయి.


ఇది కూడా చదవండిపెన్షనర్లకు గుడ్‌న్యూస్..! భారీగా పెరుగుతున్న పెన్షన్‌.. ఎంత అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Tirumala #SrivariSeva #TTDUpdates #SeniorSevaks #SevaQuota #NewDesignation #TTDNews #Tirupati